చిరంజీవి ఆచార్య సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పుడు అందరి కన్ను మెగాస్టార్ నెక్ట్స్ మూవీపై పడింది. మరీ ముఖ్యంగా బాబి సినిమాపై పడింది. ఎందుకంటే, ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇప్పుడా టైటిల్ కూడా బయటకు వచ్చేసింది. స్వయంగా చిరంజీవి ఈ మేటర్ లీక్ చేయడం ఇక్కడ విశేషం.
ఆచార్య సినిమా ప్రమోషన్ లో భాగంగా యంగ్ డైరక్టర్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు చిరంజీవి. ఈ సందర్భంగా బాబితో చేస్తున్న సినిమా టైటిల్ గురించి ఓ దర్శకుడు అడిగాడు. దీనిపై స్పందించిన చిరంజీవి, తను సినిమా పేరు చెప్పనంటూనే, వాల్తేరు వీరయ్య అనే పేరును బయటపెట్టేశారు. తను మాట్లాడితే లీకులు ఇచ్చేశానని అంతా అంటున్నారని, కాబట్టి చెప్పనంటూనే ఈ టైటిల్ బయటపెట్టారు.
ఇక బాబితో చేస్తున్న సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా కథ చాలా బాగుందని మెచ్చుకున్నారు చిరు. తను ఓ పాయింట్ చెబితే, దాన్ని బాబి చాలా అందంగా మలిచి తీసుకొస్తున్నాడని అన్నారు. బాబితో చాలా టాలెంట్ ఉందని మెచ్చుకున్న చిరు, ఆ సినిమా కచ్చితంగా బాగుంటుందని అన్నారు.
Advertisements
ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న ప్రతి సినిమాకు టైటిల్ ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు భోళాశంకర్, మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్స్ పెట్టారు. ప్రస్తుతం బాబి సినిమా మాత్రమే టైటిల్ లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పుడు ఆ టైటిల్ ను కూడా చిరు బయటపెట్టేశారు. గతంలో ఆచార్య సినిమా టైటిల్ ను కూడా ఇలానే లీక్ చేశారు.