సైరా సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటించిన చిరు పాత్ర ఎండింగ్‌లో చనిపోతారు. అయితే, ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగా ఉండే విషయం అయినా, ఓ గొప్ప వీరుని ముగింపు చూసిన తర్వాత… మంచి ఫీలింగ్‌తో ప్రేక్షకులు వస్తారని తెలుస్తోంది. అందుకే ముందు నుండే ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తూ వస్తోంది చిత్ర యూనిట్. ఎలాగు చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా అయినందున… ప్రేక్షకులు కూడా డిజప్పాయింట్ అవ్వరనేది చిత్ర యూనిట్ అంచనా. ఇక పవన్ కల్యాణ్ వాయిస్‌తో సినిమా ఎండ్ అవుతుందని తెలుస్తోంది.