చిరంజీవి నుంచి ఒకేసారి రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమాను కంప్లీట్ చేస్తూనే, మరోవైపు బాబి దర్శకత్వంలో చేస్తున్న మూవీని కొలిక్కి తీసుకొస్తున్నారు చిరు. ఇలా ఒకేసారి రెండు సినిమాలు రెడీ అవుతుండడంతో, ఏ సినిమా ముందుగా థియేటర్లలోకి వస్తుందనే అనుమానం చాలామందిలో ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబి దర్శకత్వంలో చిరంజీవి ఓ స్ట్రయిట్ మూవీ చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు. అయితే అంతలోనే భోళాశంకర్ కూడా షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకోవడంతో చాలామంది, భోళాశంకర్ సినిమానే ముందుగా వస్తుందని అనుకుంటున్నారు.
మీడియాలో వస్తున్న కథనాలపై చిరంజీవి స్పందించారు. గాడ్ ఫాదర్ తర్వాత తన నుంచి వస్తున్న సినిమాపై క్లారిటీ ఇచ్చారు. బాబి దర్శకత్వంలో చేస్తున్న సినిమానే తన నెక్ట్స్ రిలీజ్ అని ప్రకటించారు మెగాస్టార్.
అయితే ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా రాదా అనే విషయంపై చిరంజీవి స్పందించలేదు. ప్రస్తుతం మూవీ షూటింగ్ స్టేజ్ లో ఉందని, అప్పుడే విడుదల తేదీనిపై తను స్పందించనని అన్నారు. గాడ్ ఫాదర్ సక్సెస్ తర్వాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా, బాబి దర్శకత్వంలో చేస్తున్న సినిమాను కంటిన్యూ చేస్తున్నారు చిరు.