మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూట్ కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. అలాగే మరోవైపు గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు చిరు. అయితే గత కొన్ని నెలలుగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు.
కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… ఈ సినిమా విషయంలో స్పీడ్ పెంచాడట చిరు. షూటింగ్ విషయాలు బయటకు రాకపోయినప్పటికీ షెడ్యూల్ ప్రకారం అన్ని పనులు జరుగుతున్నాయట.
ఇటీవల హీరోయిన్ నయనతార కూడా హైదరాబాద్‌లో షూటింగ్ లొకేషన్ నుండి బయటకు వెళుతుండగా కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
నిజానికి గత కొన్ని నెలలుగా ఈ సినిమాకు సంబంధించి రకరకాల పుకార్లు తెరపైకి వచ్చాయి. స్క్రిప్ట్ మారిందని, రిషూటింగ్ చేస్తున్నారని ఇలా చాలానే వచ్చాయి. అయితే ఈ పుకార్లపై మేకర్స్ మాత్రం ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా వారి పని వారు చేసుకుంటూ వచ్చారు.
మోహన రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.