మెగా స్టార్ చిరంజీవితో త్రిష మరో సారి జోడి కట్టనుందట. అయితే మొదట కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య మూవీలో త్రిష ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. కానీ కొన్ని కారణాలు వల్ల ఆచార్య సినిమా నుంచి తప్పుకుంది. త్రిష స్థానంలో కాజల్ ను ఎంపిక చేసింది చిత్ర యూనిట్. ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతుంది.

చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ఆచార్య సినిమా తరువాత ‘లూసిఫర్’ రీమేక్‌తో పాటు తమిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్‌లోనూ నటించబోతున్నారు. ఈ రెండు చిత్రాల్లో ఓ చిత్రంలో చిరుతో త్రిష జోడీ కట్టనుందని వార్తలు వినపడుతున్నాయి. మరి చిరు నిజంగా త్రిషకి అవకాశం ఇచ్చాడో లేదో తెలియాలంటే దీనిపై ఎవరో ఒకరు స్పందించాలి.