మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాలో చిరు, చరణ్ కలిసి నటించే సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, తాజాగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి.. ఆచార్య సినిమా షూటింగ్ సెట్స్‌లోని ఓ అపురూప సన్నివేశాన్ని తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో రామ్ చరణ్ ఓ దగ్గర కూర్చొని మేకప్ వేసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడకు ఓ వానరం వచ్చింది. అది అలానే చరణ్ చూస్తూనే ఉంది. అక్కడ్నుంచి కదలకుండా చరణ్ చూస్తూనే ఉంది. రెండు కాళ్లపై నిలబడుతూ చరణ్ ఎదురుగానే నిల్చోంది. చరణ్‌నే చూస్త తలుపు దగ్గరే కూర్చొని ఉంది.
దీంతో చరణ్ తన మేకప్ వర్క్ కాస్త పక్కన పెట్టి.. దానికి బిస్కెట్లు ఇచ్చే ప్రయత్నం చేయగా, అది అతడి దగ్గరకు వెళ్లి కూర్చుంది. ఈ వీడియోకు శ్రీ ఆంజనేయం శ్లోకంను జోడించి చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. హనుమాన్ జయంతి రోజున ఈ వీడియోను చిరు పోస్ట్ చేయడంతో, దీన్ని మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
ఇక, ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లను స్టార్ట్ చేసే పనిలో ఉంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 23న విజయవాడలో జరుపనున్నట్లు తెలుస్తుంది.
Advertisements