మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా రారాజు. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్… ఎన్టీఆర్ కు క్రేజ్ కూడా తక్కువేం కాదు. తన నటనతో డాన్స్ తో తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అయితే ఈ ఇద్దరి మధ్య కూడా ఓసారి పోటీ వచ్చిందట.
అయితే ఆ సమయంలో చిరంజీవి వెనక్కి తగ్గిపోయాడట.అది జరిగింది ఇప్పుడు కాదు 19 ఏళ్లకు పైనే అవుతుందట. ఆది సినిమా లో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న ఎన్టీఆర్ బి.గోపాల్ దర్శకత్వంలో అల్లరి రాముడు సినిమా చేశాడు. అదే సమయానికి ఇంద్ర కూడా కంప్లీట్ అయింది. ఈ రెండు చిత్రాలకు ఒక్కరే దర్శకుడు.

అయినప్పటికీ ఈ రెండు సినిమాలను జూలై 18 న రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే అప్పటికే శ్రీ మంజునాథ, డాడీ, మృగరాజు వంటి చిత్రాలు చిరంజీవికి నిరాశపరిచాయి. అలాగే రన్ టైం విషయం కూడా అప్పట్లో ఇబ్బందికరంగా మారింది. వీటన్నింటి మధ్య రిలీజ్ ను వారంపాటు వాయిదా వేసి జూలై 24న రిలీజ్ చేశాడు. ఫస్ట్ షో తోనే అల్లరి రాముడు ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ వల్ల కలెక్షన్స్ రాబట్టింది.
ఆ తర్వాత వారానికి వచ్చిన ఇంద్ర సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. రెండు సినిమాల్లో కూడా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత సింహాద్రి సినిమా తో సూపర్ డూపర్ హిట్ ని అందుకుని రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు తారక్.
Advertisements
Also Read:
అప్పటి హీరో వేణు తొట్టెంపూడి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా ?
వాళ్లంతా నెల తక్కువ వాళ్లు… సినీనటుడి వివాదాస్పద కామెంట్స్