మెగాస్టార్ చిరంజీవి సైరా నర్సింహా రెడ్డి సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రం ఆచార్య చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. కరోనా ప్రభావం కొంత తగ్గిన తర్వాత మే నుండి ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ మొదలుకానుందని సమాచారం. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నారని ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందుకుగాను మహేష్ బాబు రెమ్యూనరేషన్ దాదాపు రోజుకు ఓ కోటి రూపాయలు ఇవ్వబోతున్నారని ప్రచారం జరిగింది.
ఈ విషయంపై తాజాగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూ లో స్పందించారు. మొదటి నుండి ఈ మూవీలోని ఓ పాత్ర కోసం కొరటాల చరణ్ నే అనుకుంటున్నారు. అయితే మహేష్ పేరు ఎలా తెరమీదకు వచ్చిందో నాకు తెలియదు. మహేష్ నాకు బిడ్డతో సమానం, అతనితో కలిసి నటించడం నాకు ఆనందం కలిగించే అంశమే. కానీ ఈ చిత్రం కోసం మహేష్ ని అసలు అనుకోలేదని సురేఖ కూడా చరణ్ ఈ మూవీలో నటించాలని కోరుకుంది అని స్పష్టం చేశాడు . చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆచార్య కోసం చరణ్ డేట్స్ కావాలంటే రాజమౌళి ఒప్పుకోవాలి. ఇది కుదరాలంటే కొరటాల శివ, రాజమౌళి కాంప్రమైజ్ అవ్వాలి.. అప్పుడే ఇది సాధ్యం అవుతుందని ఆయన పేర్కోన్నాడు.ఇక ఆచార్యలో ముందునుండి త్రిషను అనుకుంటే ఆమె ఏవో కారణాల వల్ల తప్పుకుంది. దీంతో కాజల్‌ను తీసుకుంది చిత్రబృందం. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు.