మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక మూవీ ‘సైరా’ భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా రిలీజయ్యింది. పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. మెగాస్టార్ కలల ప్రాజెక్ట్‌ను నెరవేర్చి సక్సెస్ సాధించిన సంబరంలో మెగా వారసుడు రామ్ చరణ్ ఖుషీ అయిపోతున్నాడు.
సుమారు రూ. 270 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ ఉడ్‌లకు సంబంధించిన స్టార్లు వుండటంతో ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క శెట్టి వంటి హేమాహేమీలు నటించిన ఈ మూవీ ఎందుకో యుఎస్‌లో మాత్రం వీక్ కలెక్షన్లతో నడుస్తోంది.
యుఎస్‌లో కలెక్షన్లు ఎందుకు తగ్గాయి ? యుఎస్ మార్కెట్లో అరవింద్ సమేత కన్నా తక్కువ కలెక్షన్లు ఎందుకు వున్నాయి ? దీనిపై తొలివెలుగు ఆరా తీసింది. యుఎస్‌లో వున్న కొందరు మెగాభిమానులకు ఫోన్ చేసి మాట్లాడింది. మెగాస్టార్ సినిమాకి కలెక్షన్స్ ప్రాబ్లెమ్ ఎందుకు వచ్చిందని నేరుగా అడిగిన ప్రశ్నకు వారు ఇచ్చిన సమాధానం కూడా స్ట్రెయిట్‌గానే వుంది.
కంటెంట్ బాగోలేకనో, చిరంజీవి చరిష్మా తగ్గడం వల్లో కలెక్షన్లు తగ్గలేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కొంచెం వోవర్ చేయడం వల్లే కలెక్షన్లు తగ్గాయని వారంటున్నారు.
అతిగా ఆవేశపడిన డిస్ట్రిబ్యూటర్లు, అతిగా ఆశపడే ప్రొడ్యూసర్లతో ఈ మూవీ అక్కడ దెబ్బతిన్నట్టుగా చెబుతున్నారు. టికెట్ ధర అతిగా పెంచేశారు. 49 డాలర్స్ చొప్పున టిక్కెట్లు అమ్మారు. దీన్ని ఇండియన్ కరెన్సీలోకి మార్చి చెబితే అక్షరాలా 3,496.32 రూపాయిలు.
అమ్మో అనద్దు.. బంగారు బాతు గుడ్డు పగలగొట్టే బ్యాచ్ అక్కడ కూడా తయారయ్యారు. దాంతో కలెక్షన్లు తగ్గాయి. అదీ మేటర్..