సాహో 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా. 590 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా ! ఇండియన్ సినిమాకి మన టాలీవుడ్ స్టాండర్డ్స్ తెలిసేలా చేస్తుంది అనుకుంటే వీక్ కంటెంట్‌తో వచ్చి అందరినీ నిరాశపరచింది. సినిమాని కొన్న ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా సేఫ్ జోన్‌లోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీంతో నార్త్‌లో బాహుబలి సినిమాతో ఓపెన్ అయిన డోర్స్ క్లోజ్ అవుతున్నాయి. ఇకపై తెలుగు సినిమానే కాదు, ఏ సౌత్ సినిమాని కూడా బాలీవుడ్ వర్గాలు డేర్ చేసి కొనేలా కనిపించట్లేదు. ఈ సాహో ఇంపాక్ట్ ఇప్పుడు సైరా సినిమాపై పడనుందా అంటే ట్రేడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా సినిమాని అంతకన్నా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ రామ్‌చరణ్ పెద్ద ప్లాన్ వేస్తున్నాడు కానీ, టీజర్, ట్రైలర్ చూసి మరోసారి మోసపోవడానికి అక్కడి బయ్యర్స్ రెడీగా లేరు. పైగా చిరుకి ప్రస్తుతం ప్రభాస్‌కి ఉన్న హైప్ కూడా లేదు కాబట్టి రిస్క్ చేసి భారీ మొత్తం పెట్టి సైరా సినిమాని కొంటే దెబ్బ తినాల్సి వస్తుందేమోనని బి-టౌన్ వర్గాలు భయపడుతున్నాయి. సాహో హిట్ అయ్యి ఉంటే సైరాకి లైన్ క్లియర్ అయ్యేది కానీ, ఇప్పుడు సాహో సినిమానే సేఫ్ జోన్‌లోకి వచ్చే అవకాశం కనిపించట్లేదు. సో ఇప్పుడు రిస్క్‌లో పడిన రామ్ చరణ్ తేజ్, సైరా సినిమాని ముందు అనుకున్న దానికన్నా తక్కువ బడ్జెట్‌కే అమ్ముకోవాల్సి వస్తుంది.