ఈనెల 22వ తేదీకి ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకను వాయిదా వేసినట్టు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్వీట్ చేసింది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ వేడుకను సెప్టెంబర్ 22కి వాయిదా వేశామని తెలిపింది. ఐతే, షెడ్యూల్ ప్రకారం ‘సైరా’ ట్రైలర్‌ను రేపు విడుదల చేస్తున్నామని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్వీట్‌లో పేర్కొంది. ఈ ప్రీ రిలీజ్ వేడుకను నిర్మాత రామ్ చరణ్ చాలా గ్రాండ్‌గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రేయాష్ మీడియా ఆధ్వర్యంలో ఈ వేడుక జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పనులు ప్రారంభమయ్యాయి. సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుకను గొప్పగా నిర్వహించబోతున్నామని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ప్రతినిధులు ‘తొలివెలుగు’కు చెప్పారు.
Pre-release event of #SyeRaaNarasimhaReddy is going to be a spectacle! But we had to postpone it to September 22nd owing to predicted bad weather conditions. However, as scheduled the #SyeRaaTrailer releases tomorrow! ? #SyeRaa #Chiranjeevi #RamCharan @DirSurender @KonidelaPro pic.twitter.com/xc39ErkvVW
— Konidela Pro Company (@KonidelaPro) September 17, 2019