అడవి పందులను వేటాడి తినే ఓ గ్యాంగ్ కన్ను చిరుతపులిపై పడింది. దాన్ని ఎలాగైన పట్టుకొని కూర వండుకొని తినాలని ప్లాన్ గీశారు..ప్లాన్ కు తగ్గట్టే…అన్ని వైపుల వలలు ఏర్పాటు చేశారు. అనుకున్నట్టుగానే చిరుతపులి వీరి వలలో పడింది….దాన్ని అంతమొందించి, దాని మాంసంతో కూర వండుకొని తింటుండగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు.
ఏం జరిగింది.?:
కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి పరిధిలోని మన్కులం ఫారెస్ట్ డివిజన్ లో వినోద్ అనే వ్యక్తితో పాటు మరో నలుగురు అడవి పందులను వేటాడే వారు. ఆ సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుతపులిని చంపి దాని మాంసం తినాలని వినోద్ అనుకున్నాడు.అనుకున్నట్టుగానే వల పన్నాడు..ఆరేళ్ల వయసున్న చిరుత పులి వినోద్ పన్నిన వలలో చిక్కుకుంది. దాన్ని వెంటనే తాను ఉంటున్న భవనంలోకి తీసుకెళ్లి., పదునైన ఆయుధాలతో చంపేశాడు. ఆ తర్వాత తన మిత్రులను పిలిచాడు.
అందరు కలిసి ఆ చిరుత పులిని కోసి, దాని మాంసంతో కూర వండుకున్నారు. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో వెంటనే సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు చిరుత పులి కూరతో భోజనం చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. చిరుత పులి పళ్లు, చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. పది కేజీల చిరుత పులి మాంసాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.