చియాన్ విక్రమ్… ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పనవసరం లేదు. తమిళ హీరో అయినప్పటికీ కూడా తెలుగులో కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. అయితే ప్రస్తుతం విక్రమ్ కోబ్రా సినిమా చేస్తున్నాడు. అజయ్ జ్ఞాన ముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు ముఖ్యంగా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా శనివారం కోబ్రా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో విక్రమ్ తన మార్క్ చూపించినట్టు అర్థం అవుతుంది. విభిన్న గెటప్స్ లో ఈ సినిమాలో విక్రమ్ కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.