“హీరో ఓ మెకానిక్. చకచకా టైర్లు విప్పదీయడంలో స్పెషలిస్ట్. హీరోయిన్ మూగమ్మాయి. ఏం మాట్లాడాలన్నా, తన భావాల్ని సినిమా డైలాగ్స్ రూపంలో సెల్ ఫోన్ లో వినిపిస్తుంటుంది. హీరోహీరోయిన్లకు లవ్. అంతలోనే వీళ్లిద్దరి మధ్యలోకి ఓ వజ్రం వచ్చి చేరుతుంది. సినిమా ప్రధానంగా లవ్ స్టోరి అయినా..ఒక విలువైన డైమండ్ చుట్టూ తిరుగుతుంది. వంద కోట్ల రూపాయల విలువైన డైమండ్ చోర్ బజార్ లో ప్రత్యక్షమవుతుంది. కానీ అక్కడి వాళ్లకు దాని విలువ తెలియదు. పది రూపాయలకే అమ్ముతుంటారు. ఈ డైమండ్ చుట్టూ డ్రామా, ఫన్ క్రియేట్ అవుతాయి. ఈ డైమండ్ ను హీరో ఎలా చేజిక్కించుకున్నాడు? హీరో లవ్ కు, ఈ డైమండ్ కు లింక్ ఏంటి?”
ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న చోర్ బజార్ సినిమా కథ ఇది. విడుదలకు ముందే ఇలా కథ మొత్తం బయటకొచ్చేసింది. ఎలాంటి సస్పెన్స్ లేకుండా మొత్తం ఉన్నదున్నట్టు బయటకొచ్చింది. ఇదేదో లీక్ అయిన స్టోరీలైన్ కాదు. స్వయంగా చోర్ బజార్ సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి, తన సినిమా స్టోరీ బయటకు చెప్పేశాడు.
సినిమాపై ఎవ్వరికీ ఎలాంటి ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో ఇలా స్టోరీ మొత్తాన్ని చెప్పినట్టు వెల్లడించాడు జీవన్ రెడ్డి. స్టోరీ కంటే, సినిమాలో నెరేషన్ చాలా బాగుంటుందని, చోర్ బజార్ సినిమాను అంతా చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాడు.
Advertisements
24న థియేటర్లలోకి వస్తోంది చోర్ బజార్. రాజు నిర్మించిన ఈ సినిమా, ఆకాష్ పూరి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా
నిలిచింది. గెహనా సిప్పి ఇందులో హీరోయిన్.