అధిక బరువు తగ్గడం అన్నది ఎవరికైనా సరే సవాల్‌తో కూడుకున్న పనే. శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు కరిగేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందులో భాగంగానే అనేక మంది నిత్యం జిమ్‌లలో వ్యాయామం చేస్తూ, రన్నింగ్ చేస్తూ కష్టపడుతుంటారు. ఇక సెలబ్రిటీలు అయితే నిపుణుల సహాయంతో భారీ మొత్తంలో అమాంతం బరువు తగ్గుతుంటారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కూడా ఏకంగా 98 కిలోల బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు.
సోనీ టీవీలో ది కపిల్ శర్మ షో ప్రసారం అవుతుందనే సంగతి తెలిసిందే. అయితే వచ్చే వారాంతంలో ప్రసారం కానున్న షోకు సంబంధించి ప్రోమోను టీవీ వారు తాజాగా విడుదల చేశారు. అందులో గణేష్ ఆచార్యను కపిల్ శర్మ.. మీరు ఎంత బరువు తగ్గారని అడగ్గా.. అందుకు గణేష్ ఆచార్య.. 98 కిలోలు అని సమాధానం చెప్పాడు. దీంతో కపిల్ శర్మ ఒక్క క్షణం షాక్‌కు గురయ్యాడు. వెంటనే తేరుకుని.. సాధారణంగా ఒక వ్యక్తి 46 కిలోల బరువు ఉంటాడనుకుంటే.. గణేష్ ఆచార్య బరువు తగ్గడం వల్ల ఇద్దరు మనుషులు మాయమైనట్లు అయింది.. అంటూ కపిల్ శర్మ చమత్కరించాడు.
Advertisements
ఇక ఆ షోకు చెందిన ప్రోమోలో కొరియోగ్రాఫర్లు గీతా కపూర్, టెరెన్స్ లూయిస్ లను కూడా చూడవచ్చు. కాగా గణేష్ ఆచార్య ఇప్పుడు కాదు, ఎప్పుడో బరువు తగ్గాడు. గతంలో ఆయన 200 కిలోలు ఉండేవాడు. కానీ జిమ్‌లో బాగా కష్టపడి ఏకంగా 98 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఈయన అక్షయ్ కుమార్‌కు చెందిన తాజా చిత్ర లక్ష్మీ, బెల్ బాటం అనే మూవీ, వరుణ్ ధావన్‌కు చెందిన కూలీ నంబర్ 1 అనే మూవీలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు.