హైదరాబాద్ నిజాం వారసుడిని ప్రకటించింది చౌమహల్లా ప్యాలెస్. ముకర్రమ్ ఝా మృతి చెందిన తరువాత ఆయన వారసుడిగా మీర్ మహ్మద్ అజ్మత్ అలీఖాన్ అజ్మత్ ఝూను ఎంపిక చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులు, సన్నిహితులు, నిజాం ట్రస్టీల మధ్య సంప్రదాయ పద్ధతిలో ఈ ప్రక్రియను నిర్వహించినట్లు చౌమహల్లా ప్యాలెస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. నిజాం చివరి వారసుడు ప్రిన్స్‌గా పేరుపొందిన ముకర్రమ్ ఝూ మరణించడంతో ఆయన కుమారుడు అజ్మత్ ఝూను వారసుడిగా ఎంపిక చేశారు.
అజ్మత్ ఝూ లండన్ లో ప్రాథమిక , ఉన్నత విద్యను అభ్యసించారు. అంతేకాకుండా కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఫోటోగ్రఫీ పట్టా పొందారు.అంతేకాకుండా హలీవుడ్ లో కొన్ని సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా చేశారు.
మరికొన్ని లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు చిత్రీకరించారు. తండ్రి ముకర్రమ్ ఝా అంత్యక్రియల పూర్తికి వారం రోజుల కిందట హైదరాబాద్ వచ్చిన ఆయన ప్రస్తుతం పాతబస్తీలోని తన పూర్వీకుల నివాసంలో ఉంటున్నారు.