సిక్సర్ల స్పెషలిస్ట్ క్రిస్ గేల్ పాకిస్తాన్ వెళ్తున్నట్లు ట్వీట్ చేశాడు. అందేంటి.. ఐపీఎల్ లో ఆడబోతూ పాకిస్తాన్ ఎందుకు వెళ్తున్నాడనేగా మీ డౌట్. అతను నిజంగా అక్కడికి వెళ్లడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్దామనుకున్నా కుదరని పని. అయితే ఎందుకీ ట్వీట్ చేశాడని ఆలోచిస్తున్నారా..? దానికో రీజన్ ఉంది.
పాక్ పర్యటనకు వెళ్లిన న్యూజిలాండ్ జట్టు… మొదటి వన్డే స్టార్ట్ కాకముందే టూర్ మొత్తాన్ని రద్దు చేసుకుంది. సెక్యూరిటీ రీజన్స్ కారణంగా మ్యాచ్ లు క్యాన్సిల్ చేసుకుని స్వదేశానికి వెళ్లింది. దీనిపై స్పందించిన గేల్ న్యూజిలాండ్ తీరుపై వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. నేను రేపు పాకిస్తాన్ కి వెళ్తున్నా.. నాతో ఎవరు వస్తారు..? అంటూ రాసుకొచ్చాడు.
I’m going to Pakistan tomorrow, who coming with me? 😉🙌🏿
— Chris Gayle (@henrygayle) September 18, 2021
Advertisements
గేల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ది క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు తరుఫున ఆడుతుంటాడు. ప్రస్తుతం ఐపీఎల్ కోసం దుబాయ్ లో ఉన్నాడు. 21న రాజస్థాన్ రాయల్స్ తో జరగనున్న బ్యాచ్ కోసం రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం గేల్ పాకిస్తాన్ ట్వీట్ వైరల్ గా మారింది.