సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు సృష్టించాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో అతన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా మోరిస్‌కు ముందు యువరాజ్ సింగ్‌కు అంతటి ధర పలికింది. యువీ గతంలో రూ.16 కోట్లకు అమ్ముడయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంధ ఖరీదుగల ఆటగాడిగా మోరిస్ రికార్డు సృష్టించాడు. మోరిస్ బేస్ ధర రూ.75 లక్షలే. కానీ పలు టీమ్‌లు పోటీ పడి మరీ వేలం పాడాయి. దీంతో మోరిస్‌కు వేలంలో భారీ ధర వచ్చింది. మోరిస్‌కు ముందు అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా ప్యాట్ కమిన్స్ నిలిచాడు. అతన్ని గతంలో కోల్‌కతా టీం రూ.15.5 కోట్లకు కొనుగోలు చేసింది.
మోరిస్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గానే కాక లోయర్ ఆర్డర్‌లో చక్కగా బ్యాటింగ్ చేయగలడు. మోరిస్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 70 మ్యాచ్‌లలో ఆడాడు. 23.95 సగటుతో 551 పరుగులు చేయడంతోపాటు 157.87 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. బౌలింగ్ పరంగా చూస్తే మోరిస్ 7.81 ఎకానమీ రేట్‌తో 23.98 సగటుతో మొత్తం 80 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికా తరఫున మోరిస్ అంతర్జాతీయంగా 2012లో టీ20 మ్యాచ్‌లో మొదటి సారిగా న్యూజిలాండ్ తో ఆడాడు. మొత్తం 23 అంతర్జాతీయ టీ20లు ఆడిన మోరిస్ 133 పరుగులు చేసి 34 వికెట్లు తీశాడు.
మొత్తంగా చూస్తే మోరిస్ 218 టీ20లు ఆడాడు. 21 సగటు, 151.02 స్ట్రైక్ రేట్‌తో 1764 పరుగులు సాధించాడు. 7.76 ఎకానమీ రేట్‌తో 22.09 సగటుతో 270 వికెట్లు తీశాడు. అయితే ఆశ్చర్యంగా మోరిస్ 2019 నుంచి ఇప్పటి వరకు అసలు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడకపోవడం విశేషం. అయినప్పటికీ మోరిస్‌ను కొనుగోలు చేయడంతో రాయల్స్‌కు అదనపు బలం చేకూరిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ జట్టుకు జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన సేవలు అందిస్తుండగా, మోరిస్ వల్ల ఆ జట్టు బౌలింగ్ విభాగంలో మరింత పటిష్టంగా మారిందని చెప్పవచ్చు. ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేయగలగడం రాయల్స్‌కు కలిసొస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
రాయల్స్ జట్టులో ఇప్పటికే బెన్ స్టోక్స్ ఆల్ రౌండర్ గా రాణిస్తుండడంతో మోరిస్ చేరికతో ఇంకో చక్కని ప్రదర్శన ఇచ్చే ఆల్ రౌండర్ లభించినట్లు అయింది. దీంతోపాటు జాస్ బట్లర్ కూడా ఉండడం ఆ జట్టుకు ఇంకో బలం అని చెప్పవచ్చు. మరి మోరిస్‌ను అంత భారీ రేటుకు కొన్నందుకు రాయల్స్ కు ఈ సారి వర్కవుట్ అవుతుందా, లేదా.. అన్నది చూడాలి.