జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుల మతాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడని ఆ పార్టీకే చెందిన క్రైస్తవుల సంఘం నేత అలివర్ రాయ్ కేసు పెట్టారు. పున్నమిఘాట్‌లో మత మార్పిడిలు జరుగుతు న్నాయంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని, పవన్ కళ్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి డిమాండ్ చేశారు.
అయినా కూడా ఎటువంటి పశ్చాత్తాపం, స్పందన పవన్ కళ్యాణ్ నుండి లేదని, అందువలనే తానే కేసు పెట్టానని అలివర్ రాయ్ తెలిపారు.