• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

భక్తి గీతామృతంలో అన్య విషం!

Published on : September 23, 2019 at 5:55 pm

ఏడుకొండల వాడిపైనే అందరి ఫోకస్సూ.. ! పాపాలు కడిగేసుకునేందుకు పోయేదీ అక్కడికే.. పాపాల చిట్టా ఎవరూ విప్పకుండా ధర్మకర్తల మండలి ముసుగు వేసుకోవాలని కోరుకునేదీ శ్రీవారి దగ్గరే. కలియుగాన్ని నడిపించేవాడే శ్రీనివాసుడు అని భక్తులు మనసా వాచా నమ్ముతారు. అదేమో కానీ, కలియగ పురుష పుంగవులు చేసే నానా అపచారాలన్నీ భరిస్తున్నాడు ఆ భగమంతుడు.

తాజాగా మరో వివాదాన్ని మూటగట్టుకుంది టీటీడీ ! స్వామి వారి నిధులతో సాహిత్యం మాటున అన్య మత  ప్రచారానికి బరితెగించారని తాజా ఆరోపణ. ట్విటర్‌‌లో ఈ వివాదం తాజాగా సెగలు పొగలూ రేపుతోంది.

మేటరేంటంటే.. ‘భక్తి గీతామృత లహరి’ పేరుతో ధవళేశ్వరానికి చెందిన మెండా చిన సీతారామయ్య రూపొందించిన బుక్ లెట్ టీటీడీ ఆర్ధిక సాయంతో అచ్చు వేశారు. దానిలో శ్రీవారి భక్తి పద్యాలతో పాటుగా ఏసు క్రీస్తును స్తుతిస్తూ కూడా పద్యాలు ముద్రించారని కాంట్రవర్సీ క్రియేట్ అయ్యింది. ఇందులో వాస్తవాలు తేల్చాల్సిన టీటీడీ అది వదిలేసి అత్యవసరంగా ఆన్‌లైన్‌లో వున్న ఈ పుస్తకాన్ని తొలగించేసింది. దాంతో ఈ వ్యవహారంపై ఆరోపణలు చేస్తున్న వారి అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆరోపణలు రుజువు కాకపోతే ఈ పుస్తకం ఆన్‌లైన్ వెర్షన్ ఎందుకు తొలిగించారనేదే నెటిజన్ల ప్రశ్న. వాస్తవానికి ఈ పుస్తకం ప్రింటెడ్ వెర్షన్ పంపిణీ జరిగిపోయింది. భక్తకోటి ఇళ్లకి ఇవి చేరిపోయాయి. అది చూసే ఒక భక్తుడు ఇదేమి చోద్యమని ట్విట్టర్లో ప్రశ్నించాడు. దీనిపై పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం చూసి టీటీడీ అధికారులు ముందు దీని ఆన్‌లైన్ వెర్షన్ ఎక్కడుందో చూసి దాన్ని డిలీట్ చేసి పారేశారు. ఇక్కడితో ఈ సమస్య పరిష్కారం అయిపోతుందా అని భక్తులు ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్‌కు, ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్‌‌‌కు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ట్విట్టర్లో ఫిర్యాదు చేసింది.

తిరుమలలో అన్యమత ప్రచారం ఫిర్యాదులు గతంలో కలకలం రేపాయి. ఏడుకొండలు అవసరం లేదంటూ అప్పట్లో వినవచ్చిన వ్యాఖ్యానాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. ఇప్పుడు ఏకంగా టీటీడీ సొమ్ముతో అన్యమత సాహిత్యాన్ని ముద్రించడం దారుణమని విమర్శలు వస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తిరుమల పవిత్రతను కాపాడుకునేందుకు తిరుమలేశుడే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి తప్పేట్టు లేదు.

Christian Literature on TTD's Official site published by its Financial Support.
Filed complaint with AP CS, Prl Secretary and Commissioner (Endowments), TTD JEO & Vigilance.
Sought proper investigation into the criminal conspiracy and strict action against criminals. pic.twitter.com/PaQSOIcU25

— Legal Rights Protection Forum (@lawinforce) September 23, 2019

tolivelugu app download

Filed Under: వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

(no title)

సలార్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది

సలార్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది

ఆచార్య టీజ‌ర్ అప్డేట్-వీడియో

ఆచార్య టీజ‌ర్ అప్డేట్-వీడియో

మారిన మాస్ట‌ర్ మూవీ డిజిట‌ల్ రిలీజ్ డేట్

మారిన మాస్ట‌ర్ మూవీ డిజిట‌ల్ రిలీజ్ డేట్

అల్ల‌రి న‌రేష్ నాంది డిజిట‌ల్ రిలీజ్...?

అల్ల‌రి న‌రేష్ నాంది డిజిట‌ల్ రిలీజ్…?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఏపీ పంచాయితీ ఎన్నిక‌ల‌పై రంగంలోకి గ‌వ‌ర్న‌ర్

ఏపీ పంచాయితీ ఎన్నిక‌ల‌పై రంగంలోకి గ‌వ‌ర్న‌ర్

శ‌శిక‌ళ విడుద‌ల‌- ట్విస్ట్ ఇచ్చిన సీఎం ప‌ళ‌నిస్వామి

శ‌శిక‌ళ విడుద‌ల‌- ట్విస్ట్ ఇచ్చిన సీఎం ప‌ళ‌నిస్వామి

హిందుత్వ సెంటిమెంట్ తోనే మేయ‌ర్ సీటుపై టీఆర్ఎస్ క‌న్ను...?

హిందుత్వ సెంటిమెంట్ తోనే మేయ‌ర్ సీటుపై టీఆర్ఎస్ క‌న్ను…?

తెలంగాణ క‌రోనా-147 కేసులు.. 399 రికవరీలు

తెలంగాణ క‌రోనా-147 కేసులు.. 399 రికవరీలు

రైతు ర్యాలీలో హింస వెనుక బీజేపీ ఎత్తుగ‌డ‌లు?

రైతు ర్యాలీలో హింస వెనుక బీజేపీ ఎత్తుగ‌డ‌లు?

ఆల్‌టైం హైం రికార్డు.. రూ.93కి పెట్రోల్ ధ‌ర‌

ఆల్‌టైం హైం రికార్డు.. రూ.93కి పెట్రోల్ ధ‌ర‌

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)