2021-22లో అత్యధికంగా 5,056 సమాచార హక్కు అప్పీళ్లను తమ కోర్టు పరిష్కరించిందని కేంద్ర సమాచార కమిషనర్ ఉదయ్ మహుర్కర్ తెలిపారు. సీఐసీ చరిత్రలో ఇవే అత్యధిక కేసులు కావడం విశేషమని పేర్కొన్నారు.
పురాతన, సంస్కృత రాతప్రతులపై లిఖించిన శ్లోకాన్ని ఊటంకిస్తూ.. భయం లేకుండా, ఎవరి పట్ల పక్షపాతం చూపించకుండా ఈ తీర్పులను ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. పురాతన రాత ప్రతులు ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థల దగ్గర ఉన్నా జాతీయ ఆస్తి కిందకి వస్తుందని తాను తీర్పు ఇచ్చానని, దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మేధావులు తనను ప్రశంసించినట్టు తెలిపారు.
డిజిటలైజ్ చేసిన ప్రైవేట్ సంస్థలు మూడు లక్షల మాన్యుస్క్రిప్ట్(రాత ప్రతులు)లను పరిశోధకుల ప్రయోజనం కోసం పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని నేషనల్ మాన్యుస్క్రిప్ట్ మిషన్ కు ఆదేశించినట్టు చెప్పారు.
వాటిలో 28,000 మాత్రమే పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉన్నాయని తాను గమనించిన తర్వాత ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు వెల్లడించారు.