అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మున్సిపల్ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేసిన సీఐడీ..ఇక తన పనిని మొదలుపెట్టినట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి కూడా తాజాగా నోటీసులు జారీ చేసింది.
అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీకి ఫిర్యాదు చేసింది ఆళ్ల రామకృష్ణారెడ్డినే. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అధికారులు. మాజీ సీఎం చంద్రబాబుతో సహా గత ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన నారాయణకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ కేసులో విట్‌నెస్‌గా పరిగణిస్తూ.. ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా సీఐడీ అధికారులు తాజాగా నోటీసులు ఇచ్చారు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఆయనకు ఈ నోటీసులను పంపారు.. గురువారం( రేపు) ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ రీజినల్ ఆ ఫీసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించింది.
మరోవైపు చంద్రబాబును ఈ నెల 23న విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ నోటీసులు పంపింది. దీంతో ఆ నోటీసులను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. కాగా నారాయణనుఈనెల 22న సీఐడీ హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.