టీమిండియా ఆటగాళ్లు హోలీ వేడుకల్లో మునిగి తేలారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా హోలీ వేడుకలు జరపుకున్నారు.
యా జట్టు ప్రస్తుతం అహ్మదాబాద్‌లో వుంది.ప్రాక్టీసుకు వెళ్లే సమయంలో బస్సులో ఆటగాళ్లు హోలీ ఆడారు. దీనికి సంబంధించిన ఫోటోలను భారత ఓపెనర్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ షేర్ చేశాడు.
టీమిండియాకు గిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో రన్ మిషిన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ మూవీ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు.
ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తోటి ఆటగాళ్లపై రంగులు చల్లుతున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు రోహిత్ శర్మ కూడా హోలీ సెలబ్రేషన్స్ ఫోటోలను షేర్ చేశాడు.
అందులో సూర్య కుమార్ యాదవ్, చతేశ్వర్ పుజారా, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ రంగులతో తడిసిపోయిన ఫోటోలు ఉన్నాయి. మరోవైపు నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ రెండు మ్యాచ్ లు గెలిచింది. ఆసీస్ జట్టు ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది.
దీంతో చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ ఎగురేసుకు పోవాలని భారత జట్టు భావిస్తోంది. ఈ మ్యాచ్ లో భారత్ ను మట్టికరిపించి సిరస్ ను సమం చేయాలని ఆసీస్ పట్టుదలతో ఉంది.