2020 ….కొ_ రోనా ఇయర్ గా ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరం.! ఇదే సంవత్సరంలో మన సినీ ఇండస్ట్రీ కొంత మంది గొప్ప నటలను కోల్పోయింది. తెలుగు ఇండస్ట్రీ జయప్రకాష్ రెడ్డిని కోల్పోతే , కన్నడ ఇండస్ట్రీ చిరంజీవి సర్జాను, బాలీవుడ్ అయితే సుశాంత్ , ఇర్ఫాన్ ఖాన్ లాంటి గొప్ప నటులను కోల్పోయింది
ఇర్ఫాన్ ఖాన్ :
54 సంవత్సరాల ఇర్ఫాన్ ఖాన్ ఎప్రిల్ 29, 2020 లో మరణించారు. న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఖాన్ విదేశాల్లో వైద్యం చేయించుకున్నారు. కోలన్ ఇన్ఫెక్షన్ కారణంగా ఎప్రిల్ లో చనిపోయారు. హిందీ మీడియం, లైఫ్ ఇన్ ఏ మెట్రో, మక్బూల్, లైఫ్ ఆఫ్ పై సినిమాల్లో ఇర్ఫాన్ నటన అద్భుతంగా ఉంటుంది.
సుశాంత్ సింగ్ రాజ్ పూత్ :
34 ఏళ్ల సుశాంత్ జూన్ 14 న మరణించాడు. డిప్రె_షన్ ను తట్టుకోలేక ఉరివేసు_ కొని మరణించినట్టు ప్రాథమిక అంచనాకొచ్చిన….ఈ స్టార్ మృతి పట్ల అనేక అనుమానాలను లేవనెత్తారు కుటుంబ సభ్యులు. పవిత్ర రిస్తా సీరియల్ తో నటనలోకి ప్రవేశించిన సుశాంత్ M.S. ధోని సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. దిల్ బెచారా ఇతని లాస్ట్ సినిమా.
బాల సుబ్రహ్మణ్యం :
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడిన గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం ..కొరో_నా కారణంగా సెప్టెంబర్ 25 న కన్నుమూశారు. పద్మశ్రీ, పద్మభూషన్ పురస్కారాలను పొందిన ఎస్పీబి తన 74 యేట మరణిం_చారు.
చిరంజీవి సర్జా :
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడైన చిరంజీవి సర్జా హార్ట్ ఎటాక్ కారణంగా జూన్ 6 న మరణించారు.చిరంజీవి మేఘకరాజ్ ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు… అతడి మరణం సమయంలో ప్రెగ్నెంట్ గా ఉన్న మేఘన …. అక్టోబర్ 22 న బాబుకు జన్మనిచ్చింది.
జయప్రకాష్ రెడ్డి :
రాయలసీమ యాసను అద్భుతంగా మాట్లాడుతూ…..విలన్ , కమెడియన్ పాత్రల్లో దాదాపు 300 సినిమాల్లో నటించిన జయప్రకాష్ రెడ్డి …. 2020, సెప్టెంబరు 8న గుంటూరులోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు.
Advertisements