సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెల్సిందే. అయితే రాజు ఆత్మహత్య పై సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ యాక్టర్ సీవీఎల్ నరసింహారావు, యువ హీరో తనీష్, మూవీ ఆర్టిస్ట్ సంధ్య తదిరులు రాజు ఆత్మహత్యపై స్పందించారు.
నిందితుడి ఆత్మహత్యతో తగిన శాస్తి జరింగిందని….అయితే నిందితుడి ఆత్మహత్యతో చిన్నారికి న్యాయం జరగినట్లు కాదని అన్నారు. మనతో పాటు, మన సొసైటీ మారినప్పుడే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగవన్నారు.