శ్రీయ శరన్ నార్త్ నుంచి వచ్చి సౌత్ ఇండస్ట్రీని ఏలిన అందాల భామ. శ్రీయ మంచి పెర్ఫార్మర్ మాత్రమే కాదు, అంతకు మించిన క్లాసికల్ డాన్సర్ కూడా.తెలుగులో గత 20 యేళ్ళుగా కుర్రహీరోల దగ్గర్నించి స్టార్ హీరోల వరకూ దాదాపు అందరితోనూ నటించింది.
పెళ్ళయిన తర్వాత కూడా అడపాదడపా నటిస్తూనే ఉంది. ప్రెగ్నెంట్ అయ్యాకా మాత్రం నటనకు కాస్త బ్రేక్ ఇచ్చింది. బిడ్డపుట్టిన తరువాత పూర్తి స్థాయిలో నటనపై దృష్టి సారించింది. పుట్టిన బిడ్డను ఇంతవరకూ అభిమానులతో పంచుకోలేదు.
అయితే మొట్టమొదటి సారిగా తన కూతుర్నికెమెరాకు పరిచయం చేసింది.ఆ చిన్నారిని ముద్దాడుతూ మురిసి పోతున్న శ్రీయ పిక్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు.