జాతీయ రహదారిపై రాత్రంతా షూటింగ్. ఒక వైపు వందల్లో తరలివస్తున్న జనాలు..మరో వైపు వాహనాల రాకపోకలు.ఇదంతా ఎక్కడో కాదు విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి ఉయ్యూరు మండల ఆకునూరు గ్రామం వద్ద ఫ్లైఓవర్ మీద చోటుచేసుకుంది. జాతీయ రహదారి పై షూటింగ్ జరుగుతున్న, ఒక్క పోలీస్ కూడా కానరాలేదు. మహిళలు పిల్లలు షూటింగ్ చూడటానికి తరలివస్తుంటే మరో వైపు స్పీడ్ గా వెళ్లే వాహనాలు.. వీటన్నింటిని చూసిన కొంత మంది ప్రభుత్వం, అధికారుల తీరుపై మండి పడుతున్నారు. ఇలా రాత్రంతా జాతీయ రహదారి పై షూటింగ్ చెయ్యటానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు. కేవలం నోటిమాలతో పర్మిషన్ తీసుకుని ఇలా షూటింగ్ జరిపితే జరగరాని ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యతంటూ ప్రశ్నిస్తున్నారు. కనీసం షూటింగ్ చూడటానికి వస్తున్న జనాలను కంట్రోల్ చెయ్యటానికి కూడా ఒక్క పోలీస్ కూడా రాకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. జాతీయ రహదారి నిర్మించిన నాటి నుండి ప్రమాదాలు జరుగుతున్నా అంత నిర్లక్ష్యంతో ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహమా వ్యక్తం చేస్తున్నారు.