ప్రేమించిన అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి జరుగుతుందంటే మధ్యలో తాళి కట్టే సమయానికి వెళ్లి ఆపండి అనడం సహజంగా సినిమాల్లో చూస్తుంటాం. నిత్యజీవితంలో అయితే ఎవరికి చెప్పకుండా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం చూశాం. కానీ ఈ రెండింటిని తలదన్నే విధంగా ఓ ప్రయుడు ఇచ్చిన ఎంట్రీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
యూపీలోని గోరక్ పూర్ లో ఓ యువతి పెళ్లి జరుగుతోంది. కానీ ఆ యువతి కొంత కాలంగా ఓ యువకుడితో ప్రేమలో ఉంది. తన లవర్ పెళ్లి అని తెలుసుకున్న ఆ యువకుడు మండపానికి వచ్చాడు. చివరికి సినిమా తరహాలో పెళ్లి మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు. వచ్చేటప్పుడు తనతో తెచ్చుకున్న సింధూరాన్ని యువతి నుదుటికి పెట్టే ప్రయత్నం చేశాడు. దానికి ఆమె నిరాకరించింది. కానీ అతడు ఎట్టకేలకు సింధూరం పెట్టాడు. వివాహానికి హాజరైన బంధువులు అంతా షాక్ అయ్యారు. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎవరికీ దొరకకుండా తప్పించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ప్రేయసిని చివరి సారి ఆశీర్వదించి వెళ్ళాడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.