సినిమాకు వెళ్లాలంటే… టికెట్ ధర కన్నా అక్కడ చిరు తిండికే ఎక్కువ కాస్ట్. అందుకే సామాన్య మధ్యతరగతి జనం థియేటర్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితులున్నాయి. కనీసం వాటర్ బాటిల్ కూడా ఇంటి నుండి తీసుకెళ్లాలన్నా అనుమతి ఉండదు. అధిక ధర పెట్టి అక్కడ కొనాల్సిందే.
కానీ ఇప్పుడు ఆ అవసరం లేదట. ఇదేవరో సామాన్య జనం చెప్పిన మాట కాదు. స్వయంగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ చెప్పిన మాట. ఓ నెటిజన్ ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగితే చెప్పిన మాట అదే.
ఆర్టీఐ కార్యకర్త విజయ్‌గోపాల్ పోలీసు శాఖను ప్రశ్నించగా… స్నాక్స్, వాటర్ బాటిల్స్ తీసుకెళ్లవచ్చని తెలిపారు. కానీ టిఫిన్స్ బాక్స్, ఇతర తినుబండరాలను థియేటర్లు భద్రతా కారణాల దృష్ట్యా అనుమతించటం లేదని తెలిపారు. కానీ వాటర్ బాటిల్లను తీసుకెళ్లవచ్చని తెలిపారు.
అంతేకాదు త్రిడీ సినిమాల విషయంలో థియేటర్లలోనే త్రిడీ అద్దాలు తీసుకొవాలన్న నిబంధన ఏమీ లేదని, బయట నుండి కూడా తీసుకోవచ్చని తెలిపారు కమీషనర్.