కనీవినీ ఎరుగని నష్టాలను మూటగట్టుకున్న సినీ పరిశ్రమ, థియేటర్ యాజమన్యాలు… ఇక థియేటర్లను ఓపెన్ చేసేందుకు రెడీ అయ్యాయి. అక్టోబర్ 15 నుండి థియేటర్లు ఓపెన్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందని థియేటర్ యాజమన్యాలు భావిస్తున్నాయి.
కేంద్రం ఓకే అన్న మరుక్షణమే మల్టిప్లెక్స్ లు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు రిలీజ్ చేయబోతున్నారు. కానీ థియేటర్లు మాత్రం పరిస్థితులను అంచనా వేయటం, భౌతిక దూరం పాటించే ఏర్పాట్లు ఎంత వరకు సత్ఫలితాలిస్తాయి, నష్టాల సంగతేంటీ అన్న అంశాలను పరిశీలించేందుకు దసరా నుండి కొన్ని రోజుల పాటు ట్రయల్ రన్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నష్టాలు వచ్చినా సరే ట్రయల్ రన్ చేసి, థియేటర్స్ నడపాలని థియేటర్స్ యాజమాన్యాలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు తాత్కాలికంగా నష్టాలు వచ్చినప్పటికీ… దీపావళి, క్రిస్మస్ కు మరిన్ని హిందీ, ఇంగ్లీష్ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి వకీల్ సాబ్ తో పాటు ఉప్పెన, రామ్ రెడ్ సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి నష్టాలు పూడ్చుకోవచ్చని భావిస్తున్నారు.