సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఫస్ట్ టైటిల్, ప్రి లుక్ విడుదల చేసినప్పుడు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ అని ప్రకటించారు.
ఇప్పుడు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌లో మాత్రం మధి అని ప్రకటించారు. మధి గతంలో శ్రీమంతుడు,సాహో చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ పిఎస్ వినోద్ తప్పుకోవడంతో సర్కారు వారి పాటలో మధిని తీసుకున్నారు. అయితే ఫస్ట్ ప్రకటించిన పిఎస్ వినోద్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం కరోనా మహమ్మారేనట. కరోనాతో ఈ సినిమా అనుకున్న టైమ్‌కి సెట్స్‌పైకి వెళ్లకపోవడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక వినోద్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారట.