తెలుగు సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఇరవై నాలుగు విభాగాల ప్రతినిధులు సమావేశమయ్యారు. కరోనా కారణంగా థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గటం, విద్యుత్ ఛార్జీలు ఇతర సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశానికి దిగ్గజ దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ, తమ్మారెడ్డి భరద్వాజ, నట్టికుమార్, ప్రసన్నకుమార్, సి.కళ్యాణ్, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
అయితే ఈ సమావేశంలో లో టికెట్ ల ధరలతో పాటు ఓటిటి ప్లాట్ ఫాం లో సినిమాలు విడుదల కావడం గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది తెలియాల్సి ఉంది.
ఇకపోతే ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయమూర్తి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించిన సంగతి తెలిసిందే.