పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా యూపీలో శనివారం కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాంపూర్ లో ఈ మధ్యాహ్నం నిరసనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. నిరసనకారులు పోలీస్ బారీకేడ్లను తొలగించి రాళ్లు రువ్వారు. పోలీసులు నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. రాంపూర్ లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం నుంచి జరిగిన అల్లర్లలో 9 మంది చనిపోయారు.
మరోవైపు ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్ధులపై పోలీసుల లాఠీచార్జ్ పై వరుసగా ఏడో రోజు నిరసన కొనసాగుతోంది. ఢిల్లీలోని ఓల్డ్ సిటీలో నిషేదాజ్ఞలు ఉల్లంఘించి నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చారు.
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర రైళ్లను ఆపడానికి ప్రయత్నించిన 200 మంది విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేశారు.