ప్రముఖ చరిత్రకారుడు రాంచంద్ర గుహ (61) పట్ల బెంగళూరు పోలీసులు అవమానకరంగా ప్రవర్తించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గురువారం బెంగళూరులోని టౌన్ హాల్ దగ్గర ఆయన మరికొందరితో కలిసి గురువారం నిరసనక కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతుండగానే పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చి ఆయన్ను లాక్కెళ్లారు.
”గాంధీ పోస్టర్ ను చేతిలో పట్టుకొని రాజ్యాంగం గురించి మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు వచ్చి నన్ను లాక్కెళ్లి నిర్బంధించారు” అని రాంచంద్ర గుహ అన్నారు. ”పోలీసులు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకనుగుణంగా పనిచేస్తున్నారు. మేము క్రమశిక్షణతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం..మీరే చూడండి.. ఇక్కడ ఏమైనా హింస జరుగుతుందా? అని మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసులు లాక్కెళ్లి వ్యాన్ లో కూర్చోబెట్టారు. గురువారం వాళ్లు టౌన్ హాల్ దగ్గర నిరసన చేస్తున్నట్టు తెలియగానే బుధవారం సాయంత్రం నుంచి ఆ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
రాంచంద్రగుహ అరెస్ట్ పై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఆశ్యర్యం వ్యక్తం చేశారు. రాంచంద్రగుహ అరెస్ట్ పై మీడియా ముఖ్యమంత్రిని ప్రశ్నించినప్పుడు ‘ఎక్కడ’ అని అడిగారు. కారణాలు లేకుండా పోలీసులు అరెస్ట్ చేయరు. నేను వెంటనే పోలీసులకు ఆదేశాలిస్తానన్నారు.
శాంతి భద్రతలకు భంగం కలిగించే వారు, గూండాలపై పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. సామాన్య ప్రజలపై చర్యలు తీసుకోకూడదు. ఒకవేళ అలాంటిది జరిగితే నేను అధికారులపై చర్యలు తీసుకుంటాను అన్నారు యడ్యూరప్ప.
—————————