పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను పదే పదే డ్రగ్స్ ఇష్యూలోకి లాగుతున్నారని, తన పరువుకు భంగం కలిగిస్తున్నారని మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. నష్టపరిహారం చెల్లించటంతో పాటు వెంటనే చర్యలు ప్రారంభించాలని కేటీఆర్ కోర్టును కోరారు.
అయితే, ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించలేదు. ఈ పిటిషన్ తో పాటు జత చేసిన ఆధారాలు సరిగ్గా లేవంటూ కోర్టు పిటిషన్ కు విచారణ అర్హత లేదని తేల్చింది. దీంతో పూర్తి ఆధారాలతో మంగళవారం మరో పిటిషన్ వేస్తామని కేటీఆర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.