మంత్రి కేటీఆర్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వేసిన పరువు నష్టం దావాను సిటీ సివిల్ కోర్టు విచారణ జరిపింది. సిటీ సివిల్ కోర్టు మూడవ అదనపు న్యాయమూర్తి పరువునష్టం దావాను విచారించారు. విచారణ పూర్తి చేసిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనవసరంగా డ్రగ్స్ వంటి వివాదాల్లోకి లాగుతున్నారని, తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ కోర్టుకు తెలిపారు. ఇందుకు నష్టపరిహారంతో పాటు వెంటనే క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని కేటీఆర్ కోర్టును కోరారు.
నిజానికి ఈ పిటిషన్ సోమవారమే వేశారు. అయితే, దావాకు సంబంధించి సరైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు విచారణకు తీసుకోలేదు. దీంతో మంగళవారం మరోసారి పిటిషన్ వేయగా కోర్టు విచారణకు అంగీకరించి, విచారణను పూర్తి చేసింది.
Advertisements
కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంది.