శ్రీశైల శ్రీ భమరాంబ మల్లిఖార్జున స్వామి వారిని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ దంపతులు కూడా స్వామి దర్శనం చేసుకున్నారు.
ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు దేవాదాయ శాఖ కమిషనర్ హరిజవహర్ లాల్, అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఆలయంలో సీజేఐ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీజేఐ దంపతలకు వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. వారికి స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అధికారులు అందజేశారు. స్వామి అమ్మవార్ల చిత్ర పటాలను అందచేశారు.
అనంతరం సీజేఐ దంపతులు రత్నగర్భ గణపతి స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మహామంగళ హారతి సేవలో ఆయన పాల్గొన్నారు.