ప్రజాకవి గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో చైర్మన్ చంద్రశేఖర్ ఈ అవార్డును ప్రదానం చేశారు. గోరటి రాసిన వల్లంకి తాళం అనే కవితా సంపుటికి అవార్డు వరించింది.
ఇక సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కలిశారు గోరటి. ఢిల్లీలో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గోరటిని శాలువాతో సత్కరించారు ఎన్వీ రమణ.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నందుకు ప్రత్యేకంగా అభినందించారు. సీజేఐకి వల్లంకి తాళం కవితా సంపుటిని అందించారు గోరటి. ఎన్వీ రమణ కోరిక మేరకు అడవి తల్లిపై ఓ పాట కూడా పాడి వినిపించారు.
వల్లంకి తాళం 32 గేయరూప కవితలతో వెలువడింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైంది.