దేశంలోని పలు మీడియా సంస్థలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఫైర్ అయ్యారు. పలు మీడియా సంస్థలు దేశంలో అనధికార కోర్టులను నడిపిస్తున్నాయని మండిపడ్డారు. జార్ఖండ్‌లోని రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పలు కేసుల్లో అనుభవజ్ఞులైన న్యాయ మూర్తులు కూడా ఇవ్వలేని తీర్పులను మీడియా ఇస్తోందని పేర్కొన్నారు. న్యాయ తీర్పులకు సంబంధించిన సమస్యలపై అవగాహనలేని, సొంత ఎజెండా చర్చలతో ప్రజాస్వామ్య ఆరోగ్యానికి మీడియా సంస్థలు హానికలిగిస్తున్నాయని ఆయన అన్నారు.
బాధ్యతారాహిత్యం, దూకుడు తనంతో మన ప్రజాస్వామ్యాన్ని మరో రెండు అడుగులు వెనక్కి వేసేలా మీడియా చర్యలు ఉంటున్నాయని ఆయన సీరియస్ అయ్యారు. ఈ విషయంలో ప్రింట్ మీడియా కాస్త జవాబుదారీ తనంతో వ్యవహరిస్తోందన్నారు. కానీ ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం జవాబుదారీ తనం లేకుండా ప్రవర్తిస్తోందన్నారు.
Advertisements
ఇటీవల కాలంలో న్యాయమూర్తులపై భౌతిక దాడులను ప్రస్తావిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి రక్షణ లేకుండానే న్యాయమూర్తులు సమాజంలో జీవించాల్సి వస్తోందన్నారు. రాజకీయ నేతలకు, , పోలీసు ఆఫీసర్లు, అధికారులకు ప్రజాప్రతినిధులకు పదవీ విరమణ తర్వాత కూడా రక్షణ కల్పిస్తున్నారని అన్నారు. ఈ తరహా రక్షణను జడ్జిలకు లేకుండా పోయిందన్నారు.