ఉస్మానియా యూనివర్సిటీ నుంచి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈరోజు జరిగిన 82వ స్నాతకోత్సవంలో దీనిని ప్రదానం చేశారు. 21 సంవత్సరాల తర్వాత ఓయూ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. చివరిగా బెల్ లాబొరేటరీస్ మాజీ అధ్యక్షుడు అరుణ్ నేత్రావలికి ఈ గౌరవం దక్కింది. ఇప్పుడు ఎన్వీ రమణ అందుకున్నారు. 1917 నుండి ఇప్పటివరకు ఓయూ 47 మందికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది.
దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా గతేడాది ఏప్రిల్ 24 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఎన్వీ రమణ. ఈనెల 26 వరకు ఆయన సీజేఐ హోదాలో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉస్మానియా ఆయనకు డాక్టరేట్ ను ప్రదానం చేసింది. యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ డాక్టరేట్ ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన కార్యక్రమంలో మాట్లాడారు… మాతృ మూర్తిని, మాతృ భాషని, మాతృ దేశాన్ని మరవద్దని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, సీఎం కేసీఆర్ ఈ యూనివర్సిటీ ప్రొడక్ట్ లే అన్నారు. నేను ఓయూ లా కాలేజీలో చేరాలనుకున్న, కాని నాకు అవకాశం దక్కలేదు. ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో చైతన్య సంస్కృతి ఉద్యమాల నేపథ్యం కలిగింది అన్నారు.
మాతృ మూర్తిని, మాతృ భాషని, మాతృ దేశాన్ని మరవద్దని తెలిపారు. మూలాలు మర్చి పోతే చరిత్ర, జాతి క్షమించదు. తెలంగాణపై దాశరథి, కాళోజిలా కవిత చదివిన ఎన్వీ రమణ.. మీరు మీ జీవితాల్లో పైకి రావాలి విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. ఓయూ గౌరవ డాక్టరేట్ అందుకోవడం చాల సంతోషంగా ఉందని అన్నారు. చివరగా తమిళంలో గవర్నర్ కు రొంబ థాంక్స్ అంటూ సీజేఐ ఎన్వీ రమణ ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ.. విజయానికి షార్ట్ కట్స్ లేవు. కష్టపడాలి, సమస్యల్ని ఎదురుకోవాల్సిందే అని వ్యాఖ్యానించారు. రాత్రిళ్ళు ఏ టైం వరకైనా చదవండి, కానీ ఉదయం త్వరగా లేవండి. కచ్చితంగా సమయ పాలన పాటించండి.. సాధారణంగానే ఉండండి.. అసాధారణ పనులు చేయండి అని గవర్నర్ విద్యార్థులకు సలహాలు ఇచ్చారు. సక్సెస్ కు సీక్రెట్ హార్డ్ వర్క్ మాత్రమే.. ఫోన్లని దూరం పెట్టండి అని కోరారు.
Advertisements
ఇప్పుడున్న స్థితిలో ఒక 5 నిమిషాలు కూడా మొబైల్ ని పక్కకు పెట్టే పరిస్థితి లేదు అన్నారు. అమ్మ నాన్నను చదువు చెప్పే గురువులను మర్చిపోయి, ప్రతిదీ గూగుల్ లో వెతుకుంటున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. మీ లక్ష్యాన్ని చేరుకునేలా కష్టపడండి..పెద్ద పెద్ద లక్ష్యాలే పెట్టుకోండి అని పేర్కొన్నారు. ఓయూ కాన్వకేషన్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని.. చివరగా గురుజాడ కవిత్వంతో గవర్నర్ తన ప్రసంగం ముగించారు.