న్యాయ వ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాలన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. ఢిల్లీలో మహిళా న్యాయవాదుల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సన్మాన కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన ఎన్వీ రమణ.. దసరా తర్వాత కోర్టుల్లో ప్రత్యక్ష విచారణ ప్రారంభిస్తామని చెప్పారు. దీనివల్ల న్యాయమూర్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. న్యాయవాదులకే కొన్ని సమస్యలు ఉంటాయన్నారు.
లా కాలేజీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు సీజేఐ. వారికి సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లకు తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 17 లక్షల మంది న్యాయవాదులు ఉంటే.. వారిలో 15 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని వివరించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ కమిటీలో ఒక్క మహిళ కూడా ఎందుకు లేదని తాను ఇంతకుముందే ప్రశ్నించానని గుర్తు చేశారు.