పృథ్వి ఆదిత్య దర్శకత్వంలో ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం క్లాప్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న క్లాప్ సినిమా షూటింగ్ పూర్తయింది. లాక్ డౌన్ తర్వాత చెన్నై లో షూటింగ్ ను పునఃప్రారంభం చేసి ఇప్పుడు పూర్తి చేశారు. దీనికి సంబంధించి యూనిట్ ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది.
చివరి రోజు చివరి సీన్ చిత్రీకరించాం అంటూ హీరో ఆది పినిశెట్టి డైరెక్టర్ పృథ్వి సహా టీం సభ్యులు అందరూ ఒకరినొకరు కౌగలించుకొని సెలబ్రేట్ చేసుకున్నారు. తాము ఊహించిన దానికి మించి సన్నివేశాలు బాగా వచ్చాయని ఓ స్టేడియంలో చిత్రీకరించిన స్పోర్ట్స్ బేస్డ్ సీన్లు హైలెట్ అవుతాయని చెప్పుకొచ్చారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిపి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామన్నారు. మరోవైపు ఈ సినిమాలో నాజర్, ప్రకాష్ రాజ్, రాందాస్ ,బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
It's a wrap for #CLAP! This journey is close to my heart…. Now bringing it close to your 🤍 pic.twitter.com/RFSdk4SD9M
— Aadhi's (@AadhiOfficial) December 16, 2020