సినిమా వాళ్ళకు సంబంధించిన ఏవిషయమైనా ఎంత స్పీడుగా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి.. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో న్యూస్ అయితే చెప్పనక్కర్లేదు. ప్రభాస్, కృతిసనన్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని, త్వరలో ఎంగేజ్ మెంటని.. ఆదిపురుష్ ట్రైలర్ లాంచింగ్ వేదికగా ఈ మేటర్ మూవీ ట్రైలర్ కన్నా హాట్ టాపిక్ గా నడిచింది.
కృతి మనసులో ఒక వ్యక్తి ఉన్నాడు. తను ప్రస్తుతం దీపికాతో సినిమా చేస్తున్నాడని ‘భేడియా’ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చిన్న న్యూస్ లీకిచ్చాడు. మరా న్యూస్ కి మామూలు హార్స్ పవరుంటుందా చెప్పండి! అంతే కాదు.. ఇటీవల కృతి ఇచ్చిన ఓఇంటర్వ్యూలో.. అవకాశం వస్తే, ప్రభాస్ ని పెళ్ళాడతానని నోరుజారింది. అంతే.. దేశమంతా ప్రభాస్ కృతీల ప్రేమ రూమరు.. బ్రెడ్ కి జామ్ రాసినట్టైంది.
ఈ ప్రేమ న్యూస్ కి పగ్గాలు వెయ్యాలని తలచిన కృతి… రీసెంట్ గా నోరువిప్పింది. ఇద్దరి మధ్యా వచ్చిన ప్రేమ వార్తలో వాస్తవం లేదని, ‘తోడేలు’ మూవీ హీరో వరుణ్ ధావన్ చెప్పిన సరదా మాటని కొట్టిపడేసింది. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే వెబ్ సైట్స్ ఊహలు జోడించి రాసే అవకాశమివ్వకుండా తానే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తానని కుండబద్దలు కొట్టింది.
దీంతో.. ప్రభాస్, కృతీల లవ్ రూమర్ ఖాతా క్లోజయ్యింది. కాగా.. మీ సినిమాల ప్రమోషన్స్ కి మా డార్లింగే కావాల్సొచ్చాడా అని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో విరుచుకుపడుతున్నారు.