సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషియమ్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ చేసిన వ్యాఖ్యలు తన సినిమా పై ప్రభావం చూపించనున్నాయని అందుకే నిర్మాతలు భీమ్లా నాయక్ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయబోతున్నారు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఇక ఇదే విషయమై నిర్మాత నాగ వంశీ స్పందించారు.
ముందు అనుకున్నట్టుగానే సంక్రాంతి బరిలోకి దిగబోతోన్నట్టు ప్రకటించారు. ఓన్లీ ఇన్ థియేటర్స్ అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రతిష్ట, స్వీయగౌరవానికై జరిగే యుద్దానికి సిద్దంకండి అంటూ… జనవరి 12న రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు.