మంచు కుటుంబంలో మంటలు రేగాయని..మంచు బ్రదర్స్ మధ్య కొన్నాళ్ళుగా కోల్డ్ వార్ నడుస్తుందని వార్తలు గుప్పుమన్నాయి.ఇది గ్యాసో..గ్యాసిప్పో కాదని నిరూపించే ఇంటిగుట్టు ఒకటి వీడియో రూపంలో నెట్టింట వీర విహారం చేసింది.
ఈ గొడవని మీడియా మరింత పెద్దది చేసి చూపించింది. మీడియా…అంతకు మించి రచ్చచేసిన మాటవాస్తవమే. అయితే అందరికీ షాకులిచ్చే మీడియాకే మంచు ఫ్యామిలీ షాకిచ్చింది. ఇదంతా ఫేక్ అని, అందరినీ బాగా బకరాలు చేసేశామని నవ్వుకుంటోంది మంచు ఫ్యామిలీ.
‘హౌజ్ ఆఫ్ మంచుస్’ అనే బిగ్గెస్ట్ రియాలిటీ షోలో భాగంగా ఇది ప్లాన్ చేసినట్లు.. ఇందుకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ‘మంచి కవరింగ్ ఎంచుకున్నారు.. అసలు కాన్సెప్ట్ అర్థం కాలేదు కానీ బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం’ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇంకొందరేమో ‘మేము గెస్ చేశాం ఆల్రెడీ.. మొత్తానికి ఇద్దరన్నదమ్ములు మంచి ప్రమోషన్స్ ఎంచుకున్నారు’ అంటూ అనవసరంగా రచ్చ చేసిన మీడియాపై తిట్టిపోస్తున్నారు. మరికొందరైతే.. ప్రమోషన్ కోసం కుటుంబ పరువు రోడ్డున పడేసేంత దిగజారాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.