వచ్చే శుక్రవారం కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం ఆ రోజు ఎన్టీఆర్ నుంచి సినిమా రావట్లేదు. కానీ అతని అప్ కమింగ్ సినిమా అప్ డేట్ వస్తోంది.
ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ 3’ని ప్రారంభిస్తాడని ‘కేజీఎఫ్’ నిర్మాత విజయ్ కిర్గందూర్ చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేశారు. ఈ గందరగోళాన్ని క్లియర్ చేయడానికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ను పిలిచినట్లు సమాచారం. దీంతో అదే రోజు సాయంత్రానికి ‘కేజీఎఫ్ 3’ అప్పుడే రాదంటూ హోంబలే ఫిల్మ్స్ నుంచి ప్రకటన వచ్చేసింది.
కొరటాల శివ సినిమాపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఎలాంటి ఉత్సాహం లేదన్నది వాస్తవం. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. తన అభిమానులను సంతోషపెట్టడానికి, ఎన్టీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా మే 20న తన ప్రాజెక్ట్‌ల గురించి అప్‌డేట్ ఇవ్వనున్నారు. మరో 4 రోజుల్లో కొరటాల శివ, ప్రశాంత్ నీల్ ల ప్రాజెక్ట్స్ పై క్లారిటీ వస్తుంది.
తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్-కొరటాల సినిమా ఎప్పట్నుంచి సెట్స్ పైకి రానుందనే విషయాన్ని వెల్లడించబోతున్నారు. ఇక ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి లాంఛింగ్ డేట్ వచ్చే అవకాశం ఉంది.