సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం పుష్ప. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అలాగే సమంత స్పెషల్ సాంగ్ లో కనిపించింది. మరోవైపు మలయాళ స్టార్ నటుడు ఫహడ్ ఫాసిల్ విలన్ గా నటించారు. సునీల్, అనసూయ కీలక పాత్రలలో నటించారు.
అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ వారు తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి మూడవ వారంలో స్ట్రీమ్ కాబోతుందట.