ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో పుష్ప ప్రీరిలీజ్ కు ప్రభాస్ రాబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు రాగా అదంతా ఫేక్ అని మేకర్స్ ప్రకటించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎవరూ కూడా రావటం లేదట. సోలో గానే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుందట. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ గా విలన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.