రాజమౌళి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి మొన్నటికి మొన్న వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. బాలీవుడ్ హీరోలు సైతం రాజమౌళితో ఒక్క సినిమా చేస్తే చాలు అంటూ ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే నిజానికి రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో కూడా కండిషన్స్ పెట్టరు.
కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఓ కండిషన్ పెట్టాడట. ఈ ఇద్దరూ కలిసి త్వరలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మామూలుగా అయితే రాజమౌళి తన సినిమాకు నిర్మాత హీరో ఇతర టెక్నీషియన్స్ ను అంతా ఆయనే ఫైనల్ చేసుకుంటాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ విషయంలో మహేష్ కండిషన్ పెట్టాడట.
సాయి పల్లవి వివాదంలోకి వర్మ ఎంట్రీ….ఏం జరుగుతుందో ?
ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి ఇండియా మొత్తం రీచ్ కావాలని బాలీవుడ్ హీరోయిన్స్ సంప్రదిస్తుంటే… మహేష్ బాబు మాత్రం నో చెబుతున్నారట. ఇదే విషయమై సోషల్ మీడియాలో పుకార్లు నడుస్తున్నాయి.
వెంకటేష్ భార్య నీరజా రెడ్డి…బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పటివరకు కథ రెడీ కాలేదు. అలాగే మహేష్… రాజమౌళి అంటే కథ కూడా వినడు. అలాంటిది హీరోయిన్ విషయమై రాజమౌళి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్న మహేష్ ఓకే చెప్తాడు. ఇందులో మహేష్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే మహేష్ తో హీరోయిన్ విషయం రాజమౌళి అసలు చర్చించలేదట.