మాస్ మహారాజా రవితేజ, శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజీష విజయన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమాని మార్చి 25 వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు మొదట ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ మార్చి 25వ తేదీన కుదరకపోతే ఏప్రిల్ 15వ తేదీన రిలీజ్ చేసే అవకాశం ఉందని అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ సినిమాలో నాజర్,నరేశ్, తనికెళ్ల భరణి లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు రవితేజ నటించిన ఖిలాడి ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోను ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు.మొత్తానికి రవితేజ ఫ్యాన్స్ కు మాత్రం ఈ ఏడాది ఆరంభం అదిరిందనే చెప్పాలి. వీటిలో పాటు ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లలో రవితేజ నటిస్తున్నాడు.